
ఆదిలాబాద్టౌన్, వెలుగు : అధిక ధరలతో బీజేపీ ప్రభుత్వం సామాన్య ప్రజల నడ్డి విరుస్తుంటే, ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిన కాంగ్రెస్ పార్టీ బూటకపు హామీలతో ప్రజల ముందుకు వస్తోందని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదివారం పట్టణంలోని భుక్తాపూర్ కాలనీ ప్రజలు, హమాలీ వర్కర్లు, కార్మికులు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో డీసీసీబీ, గ్రంథాలయ చైర్మన్లు అడ్డి భోజారెడ్డి, రౌత్ మనోహర్, మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజాని, వార్డ్ కౌన్సిలర్ బండారి సతీశ్ తదితరులు పాల్గొన్నారు.