ఆదిలాబాద్, వెలుగు : ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి..ముదిరాజ్ కులస్తులపై చేసిన వ్యాఖ్యలపై ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న ఫైర్ అయ్యారు. ఆదివారం ముదిరాజ్ సంఘం నాయకులు ఆయనను కలిసిన వినతిపత్రం అందజేసిన సందర్భంగా కౌశిక్ రెడ్డి తీరుపై మండిపడ్డారు. జాతి గురించి మాట్లాడితే బాగుండదని.. ఇది బీసీలందరికీ అవమానకరమన్నారు.
ఒక వ్యక్తిని దృష్టిలో ఉంచుకొని కులాన్ని దూషించడం సరైంది కాదని.. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సీఎం దృష్టికి తీసుకువెళ్తానన్నారు. బీసీ బిడ్డగా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. సంఘం జిల్లా అధ్యక్షుడు శివయ్య, ఉపాధ్యక్షుడు లస్మన్న, నాయకులు గంగన్న, గారవాని రాము, శివ, పొచ్చన్న ఉన్నారు.