ఎల్లారెడ్డి సెగ్మెంట్  డెవలప్ మెంట్ కు ఫండ్స్ ఇవ్వండి : కె. మదన్​మోహన్​రావు

ఎల్లారెడ్డి సెగ్మెంట్  డెవలప్ మెంట్ కు ఫండ్స్ ఇవ్వండి : కె. మదన్​మోహన్​రావు

కామారెడ్డి, వెలుగు: ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి ఫండ్స్​ కేటాయించాలని కోరుతూ ఎమ్మెల్యే  కె. మదన్​మోహన్​రావు సీఎం రేవంత్​రెడ్డిని కోరారు.  గురువారం హైదరాబాద్​లో సీఎం రేవంత్​రెడ్డిని ఎమ్మెల్యే కలిశారు.  

కాంగ్రెస్​ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు నియోజకవర్గానికి కేటాయించిన ఫండ్స్​, వీటితో  చేపట్టిన పనులను సీఎంకు ఎమ్మెల్యే వివరించారు.  నియోజక వర్గంలోని స్కూల్స్, హాస్పిటల్స్​, ఇందిరమ్మ ఇండ్లు, ఇరిగేషన్​ ప్రాజెక్టుల కోసం  మరిన్ని ఫండ్స్​ కేటాయించాలని కోరారు.