స్టేషన్‌ఘన్‌పూర్, వెలుగు: అవినీతి, అక్రమాలకు కేరాఫ్ బీఆర్ఎస్ పార్టీ అని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆరోపించారు. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం ఇప్పగూడెంలో కాంగ్రెస్ మండల కమిటీ అధ్యక్షుడు జూలకుంట్ల శిరీష్‌రెడ్డి ఆధ్యక్షతన గురువారం కార్నర్ మీటింగ్ జరిగింది. సముద్రాల, రంగరాయగూడెం, కోమటిగూడెం, అక్కపల్లిగూడెం, తానేదార్పల్లి, విశ్వనాథపురం, చంద్రుతండా గ్రామాల నుంచి కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలు మీటింగ్‌కు హాజరయ్యారు. చీఫ్ గెస్ట్‌గా ఎమ్మెల్యే కడియం శ్రీహరి, పీసీసీ ప్రధాన కార్యదర్శి సింగపురం ఇందిర హాజరయ్యారు. రిజర్వేషన్లు ఎత్తేసేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందన్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీలపై బీజేపీకి పట్టింపులేదన్నారు. అవినీతి, అక్రమాలకు అడ్డగా మారిన బీఆర్ఎస్ను ప్రజలు నమ్మడం లేదన్నారు. కార్యక్రమంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి సింగపురం ఇందిర, కాంగ్రెస్ రాష్ట్ర, జిల్లా నాయకులు బెలిదె వెంకన్న, తోట వెంకన్న, దైద ఇలిషన్, ఇనుగాల వెంకటేశ్వర్‌రెడ్డి, గొడుగు రాజయ్య, కత్తుల కట్టయ్య, పాల్గొన్నారు.