బండి సంజయ్..​ తెలంగాణ నీ అయ్య జాగీరా..?: కడియం శ్రీహరి

బండి సంజయ్..​ తెలంగాణ నీ అయ్య జాగీరా..?: కడియం శ్రీహరి
  • స్టేషన్​ఘన్​పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఫైర్ 
  • కిషన్ రెడ్డి ప్రెస్ మీట్ లు కాదు.. కేందం నుంచి నిధులు తీసుకురా..

స్టేషన్​ఘన్​పూర్, వెలుగు: కాంగ్రెస్​ ప్రభుత్వం పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తుంటే కేంద్ర మంత్రి బండి సంజయ్​కు  ఓర్వలేక అడ్డుకుంటున్నారని స్టేషన్​ఘన్​పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి విమర్శించారు.  కేంద్రం నుంచి నిధులు ఇవ్వమని బండి సంజయ్ అంటున్నారని.. తెలంగాణ నీ అయ్య జాగీరా..? అంటూ ఫైర్ అయ్యారు. జనగామ జిల్లా స్టేషన్​ఘన్​పూర్ కాంగ్రెస్​ఆఫీస్​లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. 

మరో కేంద్ర మంత్రి కిషన్​రెడ్డికి రాష్ట్రంపై ప్రేమ ఉంటే ప్రెస్​మీట్ లు పెట్టడం మాని..రాష్ట్ర అభివృద్ధికి రూ.10వేల కోట్ల నిధులు తీసుకురావాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆకాశంపై నుంచి ఊడి పడలేదని, అన్ని రాష్ట్రాలు కలిస్తేనే కేంద్రమని పేర్కొన్నారు. దేశంలో ఒకేసారి 4 సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత కాంగ్రెస్​ ప్రభుత్వానికే దక్కిందన్నారు. రాజ్యాంగ స్ఫూర్తికి, సుప్రీంకోర్టు తీర్పుకు లోబడి ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని ఆయన కోరారు. ఎమ్మార్పీఎస్​ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగకు పద్మశ్రీ పురస్కారం రావడం మాదిగలు, ఉప కులాలకు దక్కిన గౌరవమన్నారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్​రాంబాబు, ఏఎంసీ చైర్​పర్సన్​లావణ్య, కాంగ్రెస్​జిల్లా నేతలు నరేందర్​రెడ్డి, వెంకన్న, శంకర్​ తదితరులు 
పాల్గొన్నారు.