స్టేషన్‌ఘన్‌పూర్, వెలుగు: డివిజన్ కేంద్రం స్టేషన్‌ఘన్‌పూర్‌లో ప్రజల సౌకర్యార్థం ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్‌వెజ్ మార్కెట్ ఏర్పాటు చేస్తామని, అందుకు రూ.5 కోట్లు కేటాయిస్తామని ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి పిల్లర్ల కింద ఉన్న ప్రభుత్వ స్థలాన్ని బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్థానిక ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద సర్వే నెం 627।బీలో ప్రభుత్వ భూమి 3.01 ఎకరాలు ఉందని, రెవెన్యూ ఆఫీసర్లు సమగ్ర సర్వేచేసి హద్దులు నిర్ణయించాలని ఆదేశించారు.
స్టేషన్‌ఘన్‌పూర్, శివునిపల్లి గ్రామాల ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేలా ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్‌వెజ్ మార్కెట్, ఫ్రూట్ మార్కెట్ ఏర్పాటు చేస్తామన్నారు. అంతకుముందు మండలంలోని సముద్రాల హైస్కూల్‌ను ఎమ్మెల్యే కడియం శ్రీహరి తనిఖీ చేశారు. స్టూడెంట్లకు నాణ్యమైన విద్య అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. గ్రామంలో దంపతులు కుందూరు నాగమణిసోమిరెడ్డి నిర్మిస్తోన్న మహంకాళి దేవతా దేవాలయం పున:ప్రతిష్టాపనపూజలో పాల్గొన్నారు. ఆయనవెంట కాంగ్రెస్ జిల్లా నాయకులు బెలిదె వెంకన్న, ఇనుగాల వెంకటేశ్వరరెడ్డి, మండల అధ్యక్షుడు జూలకుంట్ల శిరీష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.