ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ ఇచ్చి పుచ్చుకునే విధంగా వ్యవహరించారని ఆరోపించారు ఎమ్మెల్యే కడియం శ్రీహారి. 40 కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనం దుర్వినియోగం జరిగినట్టు ఆధారాలున్నాయని చెప్పారు. బాండ్ల రూపంలో కేటీఆర్ కు 40 కోట్ల రూపాయలు తిరిగి వచ్చాయన్నారు. ఈ రేస్ కేసు లొట్ట పీసు కేసు అయితే కేటీఆర్ ను ఈడీ, ఏసీబీ ఎందుకు ఎంక్వయిరీకి పిలుస్తుందన్నారు.
ALSO READ | త్వరలోనే 10 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు : కేటీఆర్
సుప్రీంకోర్టు కేటీఆర్ పిటిషన్ ఎందుకు తిరస్కరించిందని ప్రశ్నించారు. ఇంత జరిగినా కేటీఆర్ అహంకారంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కల్వకుంట్ల కుటుంబమే జైలుపాలవుతూ..తెలంగాణ పరువు తీస్తుందన్నారు. జనగామ జిల్లా నిడిగొండ గ్రామంలో కాంగ్రెస్ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్నారు కడియం.