- ఎమ్మెల్యే కడియం శ్రీహరి
స్టేషన్‌ఘన్‌పూర్, వెలుగు : ‘నా బిడ్డ కడియం కావ్య వరంగల్ ఎంపీగా పోటీచేస్తోంది, మీ బిడ్డగా ఆశ్వీరదించి గెలిపించాలి.’ అని ఎమ్మెల్యే కడియం శ్రీహరి కోరారు. శుక్రవారం రాత్రి జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో మండలాధ్యక్షుడు జూలకుంట్ల శిరీష్‌రెడ్డి ఆధ్వర్యంలో కార్నర్‌మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పదేండ్లలో తెలంగాణపై వివక్ష చూపిందని, ఇక్కడ ఆ పార్టీకి ఓట్లు అడిగే హక్కు లేదన్నారు.
అనంతరం టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సింగపురం ఇందిర మాట్లాడుతూ పేదల సంక్షేమమే ధ్యేయంగా సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బెలిదె వెంకన్న, చింతకుంట్ల నరేందర్‌రెడ్డి, ఇనుగాల నర్సింహరెడ్డి, కోలిపాక సతీశ్ తదితరులు పాల్గొన్నారు.
రాజ్యాంగాన్ని మార్చే బీజేపీని తరిమి కొట్టండి..
మొగుళ్లపల్లి/ శాయంపేట, వెలుగు : రాజ్యాంగాన్ని మార్చే బీజేపీని తరిమికొట్టాలని కాంగ్రెస్ వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య ప్రజలకు, కాంగ్రెస్ క్యాడర్ కు పిలుపునిచ్చారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి, టేకుమట్ల మండల కేంద్రాల్లో శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణతో కలిసి స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లో మాట్లాడారు. మీ ఇంటి ఆడబిడ్డగా తనను గెలిపించాలని కోరారు. ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ లక్ష మెజార్టీతో కడియం కావ్య ను గెలిపించాలన్నారు
కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా ప్రెసిడెంట్ అయిత ప్రకాశ్ రెడ్డి, నాయకులు, సీపీఎం, సీపీఐ లీడర్లు పాల్గొన్నారు. హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలో మండలాధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ మాట్లాడుతూ వరంగల్ పార్లమెంట్అభ్యర్థికి లక్ష మెజార్టీ అందించి సీఎం రేవంత్‌రెడ్డికి ఇచ్చిన మాటను నిలబెట్టుకుందామని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో వరంగల్ పార్లమెంట్నియోజకవర్గ కోఆర్డినేటర్ రాంనర్సింహారెడ్డి, రాష్ర్ట నాయకుడు దొమ్మాటి సాంబయ్య, జిల్లా అధ్యక్షుడు ఐత ప్రకాశ్‌రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.