
ధర్మసాగర్, వెలుగు: హనుమకొండ జిల్లా ధర్మసాగర్ ఎంపీడీవో కార్యాలయం, వేలేరు రైతు వేదికలో స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. శనివారం ధర్మసాగర్ లో 102 మంది కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు రూ.42,82,624 విలువైన చెక్కు అందజేశారు.
వేలేరులో మొత్తం 36 మంది లబ్ధిదారులకు రూ.18,10,660 విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవాదుల మూడవ దశ అతి త్వరలో పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు. అనంతరం ఆయా మండలాల్లో నిర్వహించిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే పాల్గొన్నారు.