జనగామ జిల్లాలో దేవాదుల నీటి విడుదల

జనగామ జిల్లాలో దేవాదుల నీటి విడుదల

స్టేషన్ ఘనపూర్, వెలుగు : దేవాదుల ఎత్తిపోతల పథకం కింద నియోజకవర్గంలో మిగిలిన అన్ని పనులు పూర్తి చేయించి, 1.5 లక్షల ఎకరాలకు సాగునీరందించేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. బుధవారం జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ లోని దేవాదుల రిజర్వాయర్ కట్టపై మెయిన్ కెనాల్ డిస్ట్రిబ్యూటరీ గేట్లను ఎమ్మెల్యే ఓపెన్​ చేసి ఉప కాల్వలోకి గోదావరి జలాలను విడుదల చేశారు.

నియోజకవర్గంలోని కాల్వలు మరమ్మతులు చేసేందుకు ప్రభుత్వం రూ.148 కోట్లు విడుదల చేసిందని తెలిపారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్ పర్సన్ జులుకుంట్ల లావణ్యాశిరీశ్ రెడ్డి, కాంగ్రెస్  తదితరులు పాల్గొన్నారు.