బుగులు ఆలయాభివృద్ధిపై సీఎంకు నివేదిస్తాం

స్టేషన్​ఘన్​పూర్ (చిల్పూరు), వెలుగు: చిల్పూరుగుట్ట బుగులు వేంకటేశ్వరస్వామి దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్​రెడ్డికి నివేదిస్తామని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. జనగామ జిల్లా చిల్పూరు మండలం బుగులు వేంకటేశ్వరస్వామి ఆలయ చైర్మన్​పొట్లపల్లి శ్రీధర్​రావు, 14 మంది పాలక కమిటీ సభ్యులు సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే చీఫ్​ గెస్ట్​గా హాజరయ్యారు. ఆలయ ఈవో లక్ష్మిప్రసన్న ఆధ్వర్యంలో అర్చకులు ఎమ్మెల్యేను పూర్ణకుంభంతో స్వాగతించగా, స్వామి వారిని దర్శించుకుని పూజలు చేశారు. ఎమ్మెల్యేను, చైర్మన్​శ్రీధర్​రావును, పాలక కమిటీ సభ్యులను శేషవస్త్రాలతో సన్మానించారు. 

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పాలక కమిటీ ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. అర్చకులు రవీందర్​శర్మ, రంగాచార్యులు, డైరెక్టర్లు పాల్గొన్నారు. అంతకుముందు స్టేషన్​ఘన్​పూర్​మండలం చాగల్లు శివారులో విక్రమ్​దాబా అండ్​రెస్టారెంట్​ను ఎమ్మెల్యే కడియం ప్రారంభించారు. ఇప్పగూడెం పంచాయతీ ఆవరణలో జరిగిన గ్రామసభకు హాజరైన ఎమ్మెల్యే గ్రామాభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఎంపీడీవో అనుముల విజయశ్రీ, తహసీల్దార్​వెంకటేశ్వర్లు, ఏసీపీ భీమ్​శర్మ, సీఐ వేణు తదితరులు పాల్గొన్నారు