స్టేషన్‌ఘన్‌పూర్, వెలుగు: స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరినట్టు ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లో యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన జిల్లా అధ్యక్షుడు, మండలాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల అభినందన సభ గురువారం నిర్వహించారు. కడియం శ్రీహరి చీఫ్ గెస్ట్‌గా హాజరై మాట్లాడుతూ నియోజకవర్గ కేంద్రం స్టేషన్‌ఘన్‌పూర్‌లో మంజూరైన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్రెసిడెన్షియల్ స్కూల్స్ కాంప్లెక్స్, 100 పడకల హస్పిటల్, డిగ్రీ కాలేజీ, ఇంటిగ్రేటెడ్ ఆఫీసెస్ బిల్డింగ్ కాంప్లెక్స్ పనులకు ఈ నెల చివరివారంలో సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపనలు చేయనున్నారని తెలిపారు.
ఈ నెల 8న మడికొండలోని సత్యసాయి కన్వెన్షన్‌లో నియోజకవర్గ కాంగ్రెస్ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ మారజోడు రాంబాబు,చిల్పూరుగుట్ట బుగులు వెంకటేశ్వరస్వామి దేవస్థానం చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్‌రావు, ఏఎంసీ మాజీ ఛైర్మన్ చింతకుంట్ల నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.