
స్టేషన్‌ఘన్‌పూర్, వెలుగు : గతంలో తాను ఇచ్చిన 100 బెడ్స్హాస్పిటల్ హామీ నెరవేర్చేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే కడియం శ్రీహరి చెప్పారు. జనగామ జిల్లా రెవెన్యూ డివిజన్ కేంద్రం స్టేషన్‌ఘన్‌పూర్‌లో హాస్పిటల్ నిర్మాణానికి ఆర్టీసీ స్థలాన్ని శుక్రవారం ఎమ్మెల్యే కడియం శ్రీహరి పరిశీలించారు. అనంతరం స్థానిక కస్తూర్బా గాంధీ గర్ల్స్ స్కూల్, మోడల్ స్కూల్‌ను ఆకస్మిక తనిఖీ చేశారు.