ఏడాదిలోనే 55 వేల జాబ్స్ ఇచ్చాం : ఎమ్మెల్యే కడియం శ్రీహరి

స్టేషన్​ఘన్​పూర్, వెలుగు: ఏడాదిలోనే 55 వేల మంది కి జాబ్స్​ కల్పించిన ఘనత సీఎం రేవంత్​రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్​ ప్రజా ప్రభుత్వానికే దక్కిందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు.  జనగామ జిల్లా చిల్పూరు మండలం లింగంపల్లి గ్రామంలో ప్రభుత్వ నిధులు రూ 25 లక్షలతో గ్రామపంచాయతీ బిల్డింగ్​, రూ 12లక్షలతో అంగన్​వాడీ కేంద్రం భవనం, రూ 20 లక్షలతో అంతర్గత సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శనివారం ఎమ్మెల్యే కడియం శ్రీహరి శంకుస్థాపన చేశారు.  

జులై 2025లోపు లింగంపల్లితోపాటు సమీప గ్రామాల చెరువులను గోదావరి జలాలతో నింపే బాధ్యత తీసుకుంటానన్నారు. ఇందిరమ్మ ఇండ్లను త్వరలో మంజూరు చేస్తామన్నారు.  మార్కెట్​ చైర్ పర్సన్  జూలుకుంట్ల లావణ్య శిరీష్  ​రెడ్డి, ఎంపీడీవో శ్రీపాద మధుసూదన్​, మాజీ సర్పంచ్​ ఏదునూరి రవీందర్​ పాల్గొన్నారు.