- 76.13 లక్షల సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ
చేవెళ్ల, వెలుగు: చేవెళ్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కాలె యాదయ్య శుక్రవారం సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు. చేవెళ్ల సెగ్మెంట్ కు చెందిన 176 మంది లబ్ధిదారులకు రూ. 76.13 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ.. చేవెళ్లను మున్సిపాలిటీగా మార్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
చేవెళ్ల, కేసారం, మల్కాపూర్, దేవుని ఎర్రవల్లి, ఊరెళ్ల, రామన్నగూడ, ఇబ్రహీంపల్లి, దామరగిద్ద, మల్లారెడ్డిగూడ గ్రామపంచాయతీలను విలీనం చేసి చేవెళ్ల మున్సిపాలిటీగా మార్చేందుకు గతంలోనే తీర్మానాలు చేసినట్లు పేర్కొన్నారు. చేవెళ్ల మున్సిపాలిటీ ఏర్పాటును ఎవరూ అడ్డుకోలేరని అన్నారు. సమావేశంలో పీసీసీ సంయుక్త కార్యదర్శి మధుసూదన్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ దేవర వెంకట్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు వీరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.