చేవెళ్ల, వెలుగు: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకుని రైతులకు రుణమాఫీని చేస్తున్నారని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా చేవెళ్లలోని రైతు వేదికలో రుణమాఫీ విడుదల కార్యక్రమంలో భాగం గా ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ లో ఎమ్మెల్యే యాదయ్య, రైతులు, అధికారులు, కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గంలో 13,086 మంది రైతులకు రూ. లక్షలోపు తొలివిడతగా రూ. రూ. 69 కోట్లు చెల్లించడం జరుగుతుందని తెలిపారు. ముందుగా అంబేద్కర్విగ్రహానికి పూలమాలు వేసిన అనంతరం సీఎం చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు.
రైతు బాంధవుడు రేవంత్ రెడ్డి
వికారాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు బంధావుడని వికారాబాద్ మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్, టౌన్ ప్రెసిడెంట్ సుధాకర్ రెడ్డి కొనియాడారు. గురువారం సీఎం చిత్రపటాలకు పాలాభిషేకం చేసి, మిఠాయిలు పంచుకుని సంతోషం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు.