చేవెళ్ల, వెలుగు: ఇరిగేషన్, టౌన్ ప్లానింగ్ అధికారులు కలిసి వరద సమస్యలను పరిష్కరించాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య అధికారులకు ఆదేశించారు. రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండల ప్రజా పరిషత్ ఆఫీస్లో వరదలపై ఆర్డీఓతో కలిసి సమావేశం నిర్వమించారు. మోకిలాలోని పలోమా విల్లాస్లో వరదను తొలగించి, శాశ్వత పరిష్కారం చూపాలని చెప్పారు. సీజనల్ వ్యాధులు రాకుండా శానిటేషన్ చేయాలన్నారు.
వర్షం వచ్చినా.. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అధికారులు పరిష్కారాలపై దృష్టి పెట్టాలని చెప్పారు. సమావేశం లో తహసీల్దార్ సురేశ్ కుమార్, ఇరిగేషన్ డీఈ పరమేశ్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, ఎంపీడీఓ వెంకయ్య గౌడ్, హెచ్ఎండీఏ అధికారులు, మున్సిపల్ కమిషనర్, పోలీసులు, పాల్గొన్నారు. చేవెళ్ల మండలం అంతారం లో మెరైన్ ఫుడ్స్ అండ్ ఫీడ్స్ కంపెనీని ఎమ్మెల్యే యాదయ్య పరిశీలించారు. స్థానిక ప్రజలు ఈ కంపెనీ వల్ల ఇబ్బందులు పడుతున్నట్టు ఎమ్మెల్యేకు చెప్పగా.. ఆయన స్పందించారు. ఈ పరిశ్రమ నుంచి వచ్చే దుర్వాసను తగ్గించాలని యాజమాన్యానికి చెప్పారు. ఆయన వెంట వీరేందర్ రెడ్డి, నరేందర్
తదితరులు ఉన్నారు.