చేవెళ్ల, వెలుగు: విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో చేవెళ్ల ఆస్పత్రిలోని డయాలసిస్ వార్డు కాలిపోగా.. సోమవారం ఎమ్మెల్యే కాలె యాదయ్య సందర్శించారు. డయాలసిస్ వార్డులో సమస్య పరిష్కరించి వైద్యసేవలు అందిస్తున్నామని డాక్టర్లు ఎమ్మెల్యే కు వివరించారు.
ఆస్పత్రిలోని ఇతర వార్డులను కూడా పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వంద పడకల ఆస్పత్రికి రూ..17 కోట్లు మంజూరయ్యాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. చేవెళ్లలో అనువైన స్థలాన్ని ఎంపిక చేసి ఆస్పత్రి నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని వైద్య సిబ్బందికి సూచించారు.