అంతర్జాతీయ టీచర్ల దినోత్సవం సందర్భంగా టీచర్లకు సన్మానం

అంతర్జాతీయ టీచర్ల దినోత్సవం సందర్భంగా టీచర్లకు సన్మానం

చేవెళ్ల, వెలుగు : ప్రజాపాలనలో టీచర్ల పాత్ర కీలకమని చేవెళ్లలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. అంతర్జాతీయ టీచర్ల దినోత్సవం సందర్భంగా చేవెళ్లలో ఈ నెల 5న ఆత్మీయ సన్మాన సభను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర రాజ నర్సింహ

 చీఫ్ విప్ మహేందర్ రెడ్డి, ఆకునూరి మురళి, ఎమ్మెల్యేలు రాంమోహ్మన్​రెడ్డి, అరికెపూడి గాంధీ, మల్​రెడ్డి రంగారెడ్డి, ప్రకాశ్​గౌడ్, మనోహర్​రెడ్డి, వీర్లపల్లి శంకర్ హాజరుకానున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్లో నేడు 221 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేయనున్నట్లు తహసీల్దార్​ కృష్ణయ్య తెలిపారు.