మల్లాపూర్, వెలుగు:- కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని పూర్తిగా అమలు చేయడం లేదని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ఆరోపించారు. సోమవారం మల్లాపూర్ మండలం రాఘవపేట గ్రామంలో 60 మంది సీఎంఆర్‌ఎఫ్ లబ్ధిదారులకు రూ.14.47లక్షల విలువైన చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందుత్వ పార్టీ బీజేపీ అయోధ్యలోనే ఓడిపోయిందని, ఇప్పటికైనా మతం పేరిట రాజకీయాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. కల్యాణ లక్ష్మి, కొత్త పెన్షన్లు, రైతు భరోసా వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తోట శ్రీను, ప్యాక్స్ చైర్మన్ మోహన్ రెడ్డి , లీడర్లు శ్రీనివాస్ రెడ్డి, మల్లయ్య, గంగారెడ్డి, శరత్, లింగుస్వామి పాల్గొన్నారు.