ఉమ్మడి నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు

నల్గొండ అర్బన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు : నల్గొండ పట్టణంలో ప్రజలకు కావాల్సిన మౌలిక వసతులు కల్పించాలని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి సూచించారు. పట్టణంలోని సాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్రాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రోడ్డు, ముత్యాలమ్మ కాలనీ, అశోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బుధవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీల్లో మంచినీరు, డ్రైనేజీ, రోడ్ల పరిస్థితిని స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అశోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ముత్యాలమ్మ కాలనీల్లో మౌలిక వసతులు కల్పించాలని, అవసరమైన చోట స్తంభాలు పాతి విద్యుత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లైన్లు ఏర్పాటు చేయాలని ఆఫీసర్లను ఆదేశించారు. అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లను సరి చేయాలని, అండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డ్రైనేజీని నిర్మించిన తర్వాత సీసీ రోడ్లు వేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో నల్గొండ మున్సిపల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మందడి సైదిరెడ్డి, వైస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అబ్బగోని రమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కౌన్సిలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రదీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నాయక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మారగోని గణేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మాజీ కౌన్సిలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దండంపల్లి సత్తయ్య, నాయకులు కంకణాల వెంకట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, కాలనీ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కందాల మోహన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి పాల్గొన్నారు. అనంతరం కనగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మండలానికి చెందిన పలువురు టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చేరగా వారికి ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.

వడ్ల కొనుగోలు కేంద్రం పరిశీలన

చౌటుప్పల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు : యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిర్వహిస్తున్న వడ్ల కొనుగోలు కేంద్రాన్ని బుధవారం జిల్లా అగ్రికల్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కె.అనురాధ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె  మాట్లాడుతూ యాసంగిలో వరి సాగు చేసే రైతులు కేఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎం 118, ఐఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 64, జేజీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ -24423 రకాలను సాగు చేయాలని సూచించారు. ప్రతి రైతు ప్రధానమంత్రి కిసాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సమ్మాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిధి ఈ కేవైసీని తప్పనిసరిగా చేయించుకోవాలని చెప్పారు. ప్రస్తుత సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సరిపడా ఎరువులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఆమె వెంట చౌటుప్పల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వ్యవసాయ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిటీ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బొడ్డు శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, మండల వ్యవసాయాధికారి ముత్యాల నాగరాజు పాల్గొన్నారు. 

ఫిజియోథెరపీ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను వినియోగించుకోవాలి 

యాదాద్రి/చౌటుప్పల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు : వృద్ధుల పట్ల ప్రేమ, అభిమానం చూపాలని యాదాద్రి కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పమేలా సత్పతి సూచించారు. చౌటుప్పల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మండలం పెద్దకొండూరులో సాయి వృద్ధాశ్రమంలో రెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్రాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన  ఫిజియోథెరపీ కేంద్రాన్ని బుధవారం ఆమె ప్రారంభించి మాట్లాడారు. ఫిజియోథెరపీ కేంద్రాన్ని వృద్ధులు ఉపయోగించుకోవాలని సూచించారు. అనంతరం వృద్ధులకు దుప్పట్లు, హైజనిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చలి కిట్లు అందజేశారు. కార్యక్రమంలో మహిళా, శిశు, వయో వృద్ధుల సంక్షేమ అధికారి కృష్ణవేణి, సర్పంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కె.రమేశ్, రెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్రాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సొసైటీ సెక్రటరీ సత్యనారాయణరెడ్డి, సాయి వృద్ధాశ్రమం ప్రతినిధి అశోక్ పాల్గొన్నారు. అనంతరం కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన రోడ్డు భద్రతాకమిటీ మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆమె పాల్గొని  మాట్లాడారు. యాక్సిడెంట్లు జరగకుండా రోడ్డుపై స్పీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కంట్రోలర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో డీఆర్డీవో ఉపేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, ట్రాఫిక్​ ఏసీపీ సైదులు, డీటీవో సురేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, ఎగ్జిక్యూటివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంజినీర్లు పాల్గొన్నారు.

దేవరకొండ అభివృద్ధికి కృషి

దేవరకొండ, వెలుగు : తెలంగాణలో 70 ఏండ్లలో జరగని అభివృద్ధి ఎనిమిదేళ్ల టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాలనలో జరిగిందని ఆ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ ఎమ్మెల్యే రమావత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రవీంద్రకుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెప్పారు. నల్గొండ జిల్లా నేరడుగొమ్ము మండలం కాచరాజుపల్లి, బుగ్గతండాలో పలు అభివృద్ధి పనులకు బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబభవాని, కంబాలపల్లి, పొగిళ్ల లిఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లతో నేరడుగొమ్ము, చందంపేట మండలాలు సస్యశ్యామలం అవుతాయన్నారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ బాణావత్ పద్మ హన్మా నాయక్‌‌, జడ్పీటీసీ కేతావత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాలు, మండల అధ్యక్షుడు లోకసాని తిరపతయ్య, వైస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎంపీపీ అరేకంటి రాములు, ఎంపీటీసీ వంకునావత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బిక్కునాయక్, సర్పంచ్ నాగునాయక్ పాల్గొన్నారు.

నకిరేకల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నియోజకవర్గ అభివృద్ధికి కృషి

నార్కట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి/నకిరేకల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు : నకిరేకల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నియోజకవర్గ అభివృద్ధి కృషి చేస్తానని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య చెప్పారు. నల్గొండ జిల్లా నార్కట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి మండలం చిప్పలపల్లి, తిరుమలగిరి గ్రామాల్లో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు బుధవారం జడ్పీ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బండా నరేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వ హయాంలో తెలంగాణలో రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి జరుగుతోందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, సర్పంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఎల్లమ్మ, వలిగొండ కళమ్మ, ఎంపీటీసీలు ఉడ్ర భాగ్యమ్మ లింగారెడ్డి, పుల్లెంల ముత్తయ్య పాల్గొన్నారు. అనంతరం నార్కట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి మండలం తొండ్లాయిలో ఇటీవల చనిపోయిన పల్లె లింగయ్య ఫ్యామిలీ మెంబర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పరామర్శించి ఆర్థికసాయం అందజేశారు. అలాగే నార్కట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి బస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డిపోను హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈడీ పురుషోత్తంతో కలిసి పరిశీలించారు. నకిరేకల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మండలం వల్లభాపురంలో జరుగుతున్న సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులను పరిశీలించారు. 

ధరణి రద్దు చేయాలని కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆందోళన

ధరణి పోర్టల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రద్దు చేయడంతో పాటు, ఏకకాలంలో రుణమాఫీ చేయాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తూ కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆధ్వర్యంలో బుధవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించి, వినతిపత్రాలు అందజేశారు. నల్గొండ జిల్లా నకిరేకల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో టీపీసీసీ కార్యదర్శి కొండేటి మల్లయ్య ఆధ్వర్యంలో భారీ బైక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ర్యాలీ, మెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సభ నిర్వహించారు. పీసీసీ కో ఆర్డినేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శ్రీనివాసరావు, డాక్టర్‌ చెరుకు సుధాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సుంకరబోయిన నరసింహ, లింగాల వెంకన్న పాల్గొన్నారు. టీపీసీసీ కార్యనిర్వాహక కార్యదర్శి దైద రవీందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. నల్గొండ పట్టణంలో టీపీసీసీ సభ్యులు, కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లీడర్లు దుబ్బాక నరసింహారెడ్డి, పున్న కైలాశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేత, మాజీ జడ్పీటీసీ తండు సైదులుగౌడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిసి ఆర్డీవో ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎదుట ధర్నా చేశారు. మిర్యాలగూడలో డీసీసీ అధ్యక్షుడు కేతావత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నాయక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మున్సిపల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫ్లోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లీడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బత్తుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో బైక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ర్యాలీ నిర్వహించారు. హాలియాలో టీపీసీసీ అబ్జర్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వచన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నాయకుడు కుందూరు జైవీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, సూర్యాపేటలో డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్నయాదవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కాల్వ సుజాత, పీసీసీ అధికార ప్రతినిధి చకిలం రాజేశ్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు, కోదాడలో మాజీ ఎమ్మెల్యే ఉత్తమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పద్మావతిరెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షుడు పార సీతయ్య, హుజూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పీసీసీ సభ్యుడు దొంగరి వెంకటేశ్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, తుంగతుర్తిలో నియోజకవర్గ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి గుడిపాటి నర్సయ్య, యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఏఐసీసీ సభ్యురాలు పాల్వాయి స్రవంతి, నాయకులు చల్లమల్ల కృష్ణారెడ్డి, ఆలేరు, భువనగిరిలో బీర్ల అయిలయ్య, తంగళ్లపల్లి రవికుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.  - వెలుగు నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

రైతుల సమస్యలపై పోరాటాలు

నల్గొండ అర్బన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు : రైతుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు నిర్వహించనున్నట్లు రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ప్రకటించారు. నల్గొండ పట్టణంలో బుధవారం మీడియాతో మాట్లాడారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించేలా సమగ్ర చట్టాన్ని రూపొందించాలని, ఏకకాలంలో రుణమాఫీ, పంట బీమా, నకిలీ కల్తీ విత్తనాలు అరికట్టడం, పంటల బీమా పథకాన్ని అమలు చేయాలని, పోడు సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. నల్గొండ జిల్లాలో పండ్ల తోటల రైతులు ఎక్కువగా ఉన్నందున వారు పండించిన పంటలకు మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సౌకర్యం కల్పించాలని కోరారు. జిల్లాలో పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రూ.2 వేల కోట్లు కేటాయించాలన్నారు. రైతు సంఘం రాష్ట్ర మహాసభలను సక్సెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర కమిటీ సభ్యుడు ముదిరెడ్డి సుధాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీశైలం, సహాయ కార్యదర్శి నాగిరెడ్డి, రాష్ట్ర మహిళా కన్వీనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రమీల పాల్గొన్నారు.

వివేక్‌‌ వెంకటస్వామి బర్త్‌‌డే వేడుకలు

సూర్యాపేట, వెలుగు : మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యుడు వివేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెంకటస్వామి పుట్టినరోజు వేడుకలను బుధవారం సూర్యాపేటలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఓయూ జేఏసీ నేత జటంగి సురేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆధ్వర్యంలో స్థానిక అనాథాశ్రమంలో పండ్లు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విశాక ట్రస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేరుతో పేదలకు ఎన్నో సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో రాజేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నిరంజన్, సందీప్, ప్రశాంత్, నాని, రాంబాబు, మహేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.

మునుగోడులో నేడు మంత్రుల పర్యటన

నల్గొండ, వెలుగు : ఉప ఎన్నికల టైంలో ఇచ్చిన హామీల అమలులో భాగంగా గురువారం మునుగోడులో రివ్యూ మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్వహించనున్నారు. స్థానిక ధనలక్ష్మి ఫంక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉదయం 11 గంటలకు జరిగే సమావేశానికి  కేటీఆర్‌తో పాటు మంత్రులు జగదీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు, వేముల ప్రశాంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి హాజరుకానున్నారు. మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక జడ్పీటీసీలు, ఎంపీపీలతో పాటు, ఉమ్మడి జిల్లాలోని 19 మున్సిపాలిటీల ఆఫీసర్లకు కూడా రానున్నారు. సమావేశంలో ప్రధానంగా రోడ్లు, పోడు భూములు, మున్సిపాలిటీల్లో ప్రధాన సమస్యలపై చర్చించే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై బుధవారం నల్గొండ కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వినయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కృష్ణారెడ్డి, అడిషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఖుష్బూ గుప్తా సమావేశం నిర్వహించారు.