మరోసారి ఆశీర్వదించండి : కందాళ ఉపేందర్​రెడ్డి

నేలకొండపల్లి , వెలుగు : ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించే తనను మరోసారి ఆశీర్వదించాలని పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్​రెడ్డి కోరారు. శుక్రవారం మండలంలోని కొత్తకొత్తూరు, తిరుమలాపురం, రాజారాంపేట, మోఠాపురం, కట్టుకొమ్ము తండా, శంకరగిరితండా, రాజేశ్వరపురంలో ఆయన ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్​పర్సన్​మరికంటి ధనలక్ష్మి, ఎంపీపీ వజ్జా రమ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ శాంత, వివిధ పంచాయతీ సర్పంచులు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.  

పార్టీలో పలువురి చేరిక    

కూసుమంచి, వెలుగు :  కూసుమంచి మండల బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్​లో బోడియా తండ వార్డు మెంబర్లు భూక్యా రవి, బాధావత్ భావుసింగ్, సీపీఎం సీనియర్ నాయకులు భూక్యా మచ్చు, టీడీపీ సీనియర్ నాయకులు అంగోత్ హనుమ, వెంకన్నతో పాటు 22 కుటుంబాలు ఎమ్మెల్యే కందాళ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ ఇంటూరి శేఖర్, మండల అధ్యక్షుడు వేముల వీరయ్య ఉన్నారు.