సారూ..డబుల్ ​బెడ్​రూం ఇప్పించుర్రి.. పాలేరు ఎమ్మెల్యే కాళ్లపై పడబోయిన మహిళ

సారూ..డబుల్ ​బెడ్​రూం ఇప్పించుర్రి.. పాలేరు ఎమ్మెల్యే కాళ్లపై పడబోయిన మహిళ

కూసుమంచి, వెలుగు :  మేం చాలాకాలంగా గుడిసెల్లోనే బతుకుతున్నం. మాకు డబుల్​ బెడ్​రూం ఇండ్లు ఇప్పించండి’ అంటూ ఓ నిరుపేద మహిళ సోమవారం పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్​రెడ్డి కాళ్లపై పడబోయింది. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకన్​గూడెంలో సోమవారం హరితోత్సవం నిర్వహించగా దీనికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సుమారు 30 మంది మహిళలు ఎమ్మెల్యే దగ్గరకు వచ్చి తమ గోడు వెల్లబోసుకున్నారు. 

తామంతా నాయకన్​గూడెంలోని ఎన్ఎస్పీ స్థలంలో మూడేండ్లుగా గుడిసెలు వేసుకుని ఉంటున్నామని, కూలి పని చేసుకుని బతుకుతున్నామన్నారు. తమకు డబుల్​బెడ్​రూం ఇండ్లు ఇచ్చి ఆదుకోవాలన్నారు. ఓ మహిళ ఎమ్మెల్యే కాళ్లపై పడబోగా ఆపారు. డీఆర్​డీఏ పీడీ విద్యాచందన, ఎంపీపీ బానోతు శ్రీనివాస్​నాయక్​, డీసీసీబీ డైరెక్టర్​ ఇంటూరి శేఖర్​, తహసీల్దార్​ మీనన్​, ఎంపీడీవో కరుణాకర్​రెడ్డి పాల్గొన్నారు.