MLA kandala: ఈ ప్రాంతానికి సంబంధం లేనోళ్లు వస్తున్నరు: కందాల ఉపేందర్

బీఆర్ఎస్ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి వైఎస్ షర్మిలపై విమర్శలు చేశారు. ఖమ్మం జిల్లా పాలేరులో కూసుమంచి మండలం చేగోమ్మ గ్రామంలో మాట్లాడిన ఆయన.. ఇక్కడ కూర్చున్న వాళ్లంతా ఈ ప్రాంత బిడ్డలైనప్పుడు, నాయకులు పరాయి వాళ్ళు కావాలా.. తమకు చేత కాదా.. అని అన్నారు. ఈ ఊరికి ఈ ప్రాంతానికి సంబంధం లేని వాళ్లు వస్తున్నారు.. వాళ్లతో జాగ్రత్త  అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ప్రాంత వాసిగా ప్రజలకు కొంతైనా చెయ్యాలనేదే తన ఆశయమని స్పష్టం చేశారు. ఎంజాయ్ చేయాలనుకుంటే తనకు చాలా ఉంది కానీ సేవ చేయాలనేదే తన అభిమతమని చెప్పారు. అందుకే తాను, తన సతీమణి కలిసి గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి. . ప్రతి ఒక్కరినీ కలుస్తున్నామని తెలిపారు.