
ఆమనగల్లు, వెలుగు: కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ డి–82 కాలువకు డైవర్షన్స్, గేట్వాల్వ్స్ఏర్పాటు చేసి, వర్షాకాలంలో గండ్లు పడకుండా చర్యలు తీసుకోవాలని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. కల్వకుర్తి నియోజకవర్గం లోని మాడ్గుల్ మండలంలో ఈదురు గాలులతో కూడిన వర్షానికి నాలుగు 4 వేల ఎకరాల్లో మొక్కజొన్న పంటకు నష్టం వాటిల్లిందని, రైతులకు పరిహారం ఇవ్వాలని కోరారు.
శిరసనగండ్ల బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు చేయండి
వంగూర్, వెలుగు: ఏప్రిల్ 5 నుంచి జరగనున్న చారకొండ మండలంలోని శిరసనగండ్ల సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు చేయాలని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఆదేశించారు. బుధవారం ఆలయంలో ఆలయ కమిటీ చైర్మన్ డేరం రామశర్మ, వివిధ శాఖల అధికారులతో సమావేశమయ్యారు. జడ్పీ మాజీ వైస్ చైర్మన్ ఠాగూర్ బాలాసింగ్, తహసీల్దార్ సునీత, ఎంపీడీవో ఇస్సాక్ హుస్సేన్, డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ విష్ణువర్ధన్ రెడ్డి, ఎస్ఐ శంషొద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
చెక్కులు పంపిణీ
కల్వకుర్తి, వెలుగు: కల్వకుర్తి, వెల్దండ మండలాల లబ్ధిదారులకు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి బుధవారం కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. అంతకుముందు కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో టీబీ మందులు అందజేశారు. వెల్దండ మండలంలో ఇందిరమ్మ ఇండ్లకు శంకుస్థాపన చేశారు. సాయంత్రం ప్రభుత్వం ఆధ్వర్యంలో ముస్లింలకు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ మెంబర్ బాలాజీ సింగ్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.