కామారెడ్డిటౌన్, వెలుగు : పుస్తకాలు చదివితే జ్ఞానం పెరుగుతోందని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. గురువారం కామారెడ్డి జిల్లాలో గ్రంథాలయ వారోత్సవాలను ఎమ్మెల్యే జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే ఎక్కడైనా జ్ఞానమే అధికారమన్నారు. గ్రంథాలయాలకు యువత రెగ్యులర్‌గా వచ్చి బుక్స్ చదివి పోటీ పరీక్షల్లో విజేతలుగా నిలవాలని సూచించారు.
జిల్లా గ్రంథాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్‌రెడ్డి మాట్లాడుతూ గ్రంథాలయం ఒక దేవాలయం లాంటిదన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ, జిల్లా లైబ్రరీ సెక్రటరీ వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.