కామారెడ్డి నియోజకవర్గంలో అవినీతి రహిత పాలన అందిస్తా : కాటిపల్లి వెంకటరమణారెడ్డి

కామారెడ్డి టౌన్, వెలుగు :  నియోజకవర్గంలో అవినీతి రహిత పాలన అందిస్తానని కామారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన కాటిపల్లి వెంటరమణారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ఇక్కడి ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానన్నారు.   కేసీఆర్, రేవంత్​రెడ్డి ఇక్కడికి వచ్చి పోటీచేసినా ప్రజలు తనపై పూర్తి భరోసాతో 
బ్రహ్మాండమైన విజయం అందించారన్నారు. తాను ఎన్నికల్లో మందు, పైసలు పంచలేదని, నిజాయతీగా ఉన్నందుకే ప్రజలు గెలిపించారని చెప్పారు.

కామారెడ్డిలో బీజేపీ విజయం సాధించడం పట్ల ఆ పార్టీ శ్రేణులు సంబురాలు చేసుకున్నాయి. ఫలితాలు వెలువడిన వెంటనే నియోజకవర్గంలోని ఆయా గ్రామాలు, టౌన్ ల​నుంచి పార్టీ లీడర్లు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో రమణారెడ్డి ఇంటికి తరలివచ్చారు.   డ్యాన్స్​లు చేస్తూ కాలనీలో ర్యాలీ తీశారు. రమణారెడ్డిని కలిసి అభినందనలు తెలిపారు.