సీఎం రేవంత్ రెడ్డితోనే నా పంచాయితీ : బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్​ రెడ్డి

సీఎం రేవంత్ రెడ్డితోనే నా పంచాయితీ : బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్​ రెడ్డి

హైదరాబాద్, వెలుగు : తన పంచాయితీ రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ తో కాదని, సీఎం రేవంత్ రెడ్డితోనే అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అన్నారు. బుధవారం తెలంగాణ భవన్‌‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు డ్రగ్ టెస్ట్‌‌కు రావాలని సవాల్‌‌ చేశానని..  ఆ పార్టీ నేతలు తమకు చెప్పకుండా ఆస్పత్రికి వెళ్లి వెంటనే రమ్మంటే ఎలా అని ప్రశ్నించారు.

డ్రగ్స్‌‌ కేసులో తనను ఇరికించాలని సీఎం రేవంత్‌‌రెడ్డి ప్రయత్నించారని, కేటీఆర్‌‌పై కూడా ఇలాగే ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. సీఎం రేవంత్‌‌రెడ్డి తన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో డ్రగ్స్‌‌ టెస్టుకు రావాలన్నారు.  కాంగ్రెస్‌‌ పాలనతో ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదని కౌశిక్‌‌ రెడ్డి విమర్శించారు.