మహిళల ఆర్థికాభివృద్ధికి సర్కారు కృషి : కవ్వంపల్లి సత్యనారాయణ

  • ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ 

బెజ్జంకి, వెలుగు: మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే సత్యనారాయణ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో బెజ్జంకి, పోతారం గ్రామంలో అంగన్వాడీ భవనానికి భూమి పూజ, గుండారం, చిలాపూర్ పల్లెలో సీసీ రోడ్డుకు, ప్రైమరీ స్కూల్​లో కిచెన్ షెడ్ కు  భూమి పూజ చేశారు. ఎంపీపీ ఆఫీసులో 31 మంది లబ్ధిదారులకు షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. కల్లేపల్లి గ్రామానికి చెందిన అంబేద్కర్ మహిళా సంఘం గ్రూపు సభ్యులు రేణుక, వెంకటలక్ష్మిల ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను ప్రారంభించారు.

 కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ జయదేవ్ ఆర్య, ప్రాజెక్ట్ మేనేజర్ కర్ణాకర్, ఎంపీడీవో అంజయ్య, తహసీల్దార్​శ్రీనివాస్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ కృష్ణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దామోదర్, పార్టీ అధ్యక్షుడు రత్నాకర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, పోషయ్య,  శ్రీనివాస్ గౌడ్, సంతోష్, శ్రీకాంత్, మల్లికార్జున్, నరసయ్య, శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.

ఆలయాన్ని అభివృద్ధి చేస్తా

మండల కేంద్రంలో లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే సత్యనారాయణ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో జరిగిన నూతన ఆలయ పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. ఆలయ చైర్మన్ గా జిల్లా ప్రభాకర్, డైరెక్టర్ గా బర్ల రాజయ్య, బెజగం విశ్వప్రసాద్, గుబురే  చంద్రయ్య, ధోని శ్యామ్, ఐలేని జయ, భువనగిరి ప్రభాకర్ ప్రమాణ స్వేకారం చేశారు. కార్యక్రమంలో ఎండోమెంట్ ఇన్​స్పెక్టర్​విజయలక్ష్మి, ఆలయ ఈవో విశ్వనాథ శర్మ, ప్రధాన పూజారి మధుసూదనాచారి పాల్గొన్నారు.