ఎదురెదురు పడిన బండి సంజయ్ – కవిత.. చిరునవ్వులతో


నిజామాబాద్ జిల్లాలో ఆసక్తికరమైన  సన్నివేశం జరిగింది.  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఒకరికొకరు తారసపడ్డారు. రాష్ట్ర రాజకీయాల్లో నిత్యం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే వీరిద్దరూ 2023 మే 31 బుధవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ లో  కలుసుకుని నవ్వుతూ ఆత్మీయంగా పలకరించుకున్నారు. 

ఈ సందర్భంగా  బీఆర్ఎస్  ఎమ్మెల్యే గణేష్ గుప్తాతో పాటుగా స్థానిక బీఆర్ఎస్ నేతలను కవిత..  బండి సంజయ్  కు పరిచయం  చేశారు.  ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నిజామాబాద్ బీజేపీ అధ్యక్షుడు బసవ లక్ష్మీ నారయణ గృహప్రవేశానికి వీరిద్దరూ హాజరు అయినట్లుగా తెలుస్తోంది.  

మరోవైపు రెజ్లర్లను లైంగికంగా వేధించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కేంద్ర ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిలదీశారు. గత కొంతకాలంగా దేశ రాజధానిలో రెజ్లర్లు వివిధ రూపాల్లో నిరసనలు ఆందోళనలు తెలుపుతున్న కూడా కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు.ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి రెజ్లర్లు లేవనెత్తుతున్న అంశాలను పరిగణలోకి తీసుకుని తగిన పరిష్కారం చూపాలని ఆమె డిమాండ్ చేశారు.