- రుణమాఫీ, రైతు భరోసా ఇస్తాం
బెజ్జంకి, వెలుగు : ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి రైతులు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర తీసుకోవాలని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. బుధవారం మండలంలోని ఫ్యాక్స్, ఐకేపీ ఆధ్వర్యంలో దేవక్కపల్లి, వడ్లూరు, గూడెం, లక్ష్మీపూర్, వీరాపూర్, దాచారం గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు దళారుల నమ్మి మోసపోవద్దని, కొనుగోలు సెంటర్ నిర్వాహకులు 40 కిలోల 600 గ్రాములు తూకం వేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఫ్యాక్స్ చైర్మన్ తన్నీరు శరత్ రావు, ఏఎంసీ చైర్మన్ పులి కృష్ణ, తహసీల్దార్ ఉట్కూరు శ్రీనివాస్ రెడ్డి, కడివేరు ప్రవీణ్, వైస్ చైర్మన్ చిలువేరు శ్రీనివాస్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్, పార్టీ అధ్యక్షులు ముఖ్య రత్నాకర్ రెడ్డి, ఏపీఎం నరసయ్య, డైరెక్టర్ రాజు, మధుసూదన్ రెడ్డి, గూడెల్లి శ్రీకాంత్, చెప్పాల శ్రీనివాస్ గౌడ్, రంగూన్ రాజు, బైర సంతోశ్తదితరులు పాల్గొన్నారు.