సంగమేశ్వర స్వామిని  దర్శించుకున్న ఎమ్మెల్యే

సంగమేశ్వర స్వామిని  దర్శించుకున్న ఎమ్మెల్యే

బెజ్జంకి, వెలుగు: మండలంలోని బేగంపేట గ్రామంలో ఆనందయ్య మఠంలోని సంగమేశ్వరుని స్వామిని, దాసరం గ్రామంలో తాపాల లక్ష్మీ నరసింహ స్వామిని శుక్రవారం ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ దర్శించుకున్నారు. స్వామివారికి పంచామృతాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి  రథాన్ని పురవీధుల్లో ఊరేగించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు.