- ఇండస్ట్రియల్ హబ్ తో దశ మారనున్న వేంపల్లి
- ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల, వెలుగు: బీఆర్ఎస్ దుకాణం మూతపడిందని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు విమర్శించారు. మంచిర్యాల జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న వేంపల్లి గ్రామం ఇండస్ట్రియల్ హబ్‌గా మారడం వల్ల పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందుతుందని అన్నారు. మంగళ వారం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఇండస్ట్రియల్హబ్ భూదాతలతో సమావేశమయ్యారు. ఇండస్ట్రియల్ హబ్ కోసం భూములను స్వచ్ఛందంగా ఇస్తున్నట్లు భూ యజమానులు తెలుపగా.. వారికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.
నెల రోజుల్లోపు పరిహారం ఇచ్చేలా చర్యలు తీసుకుంటానని భరోసా ఇచ్చారు. పరిహారంతో పాటు దసరా నాటికి అన్ని సౌకర్యాలతో ఇల్లు నిర్మించి అప్పగిస్తామని, పరిశ్రమల ఏర్పాటు తర్వాత నిర్వాసిత కుటుంబాలకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. అభివృద్ధిని అడ్డుకోవాలనే విపక్షాలు కుట్ర పన్నాయని, పారిశ్రామిక రంగం అభివృద్ధి విషయంలో ఎవరు అడ్డుపడినా సహించబోమని హెచ్చరించారు. బీజేపీ పేరుతో ఓట్ల వ్యాపారం చేస్తోందని, బీఆర్ఎస్ పదేండ్లు అధికారంలో ఉన్నా ప్రజలకు ఏమీ చేయలేకపోయిందని విమర్శించారు.