మంచిర్యాల, వెలుగు: మంచిర్యాలలో కొత్తగా హాస్పిటల్స్ నిర్మించి కార్పొరేట్‌స్థాయిలో వైద్యసేవలు అందిస్తామని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు అన్నారు. మంగళవారం ఆయన స్థానిక గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్‌ను సందర్శించారు. ఇన్ వార్డు, అవుట్ వార్డులను పరిశీలించారు.
పేషెంట్లను ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. డాక్టర్లు, సిబ్బంది బాగా చూస్తున్నారా? అని ఆరా తీశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మరో ఏడాదిన్నర కాలంలో ఐబీ స్థలంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ ప్రాంతా లకు వెళ్లే పరిస్థితి రాదన్నారు.