![రేవంత్‌కు పీసీసీ ఇవ్వాల్సిన అవసరమేంది?](https://static.v6velugu.com/uploads/2022/03/MLA-Komatireddy-Raja-Gopal-Reddy-has-said-that-the-right-decisions-are-not-being-implemented-at-the-right-time-in-the-Congress_iXljPJmoxt.jpg)
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్‌లో సరైన సమయంలో సరైన నిర్ణయాలు అమలు జరగడం లేదని, పీసీసీ చీఫ్ ఎంపిక సరిగ్గా జరగలేదని ఆ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం సీఎల్పీలో ఆయన మీడియాతో చిట్‌చాట్ చేశారు. నిజమైన కాంగ్రెస్ వాదులకు పదవులు ఇవ్వాలని, తెలంగాణను వ్యతిరేకించిన పార్టీ నుంచి వచ్చిన వారికి ఇస్తే ఎలా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డికి పీసీసీ ఇవ్వాల్సిన అవసరం ఏముందన్నారు. ఎల్లయ్య, మల్లయ్య అభిప్రాయం తీసుకొని అధ్యక్షున్ని నియమిస్తారా అని ప్రశ్నించారు. తెలంగాణ కోసం తాము కొట్లాడామని, 30 ఏండ్లుగా పార్టీని నమ్ముకొని పని చేస్తున్న తమలాంటి వారి పరిస్థితి ఏమిటన్నారు. కొత్తగా వచ్చిన వారికి పదవులు ఇస్తే తెలంగాణలో పార్టీ బతికి బట్టకడుతుందన్నారు.