మునుగోడులో కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి :  ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

మునుగోడులో కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి :  ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

మునుగోడు, వెలుగు : ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సూచించారు. కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శంకర కంటి ఆస్పత్రి వారు ఆదివారం మునుగోడులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని ఎమ్మెల్యే కోమటిరెడ్డి ప్రారంభించి మాట్లాడారు. నియోజకవర్గంలో ఫ్లోరైడ్  తోపాటు కంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు.

నియోజకవర్గంలో ప్రతిఒక్కరికీ కంటి పరీక్షలు చేసి అవసరమైన వారికి ఆపరేషన్లు చేయిస్తానని తెలిపారు. ఏడు మండలాల్లో ప్రతి నెలా ఒకచోట ఉచిత మెగా కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేసి పరీక్షలు చేస్తామన్నారు. కార్యక్రమంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి కోమటిరెడ్డి లక్ష్మీరాజగోపాల్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ కుంభంశ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీపీ కర్నాటి స్వామియాదవ్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డి పాల్గొన్నారు.