ప్రభుత్వ స్థలాలు, పేదల జోలికొస్తే సహించేది లేదు : ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

ప్రభుత్వ స్థలాలు, పేదల జోలికొస్తే సహించేది లేదు : ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

చౌటుప్పల్, మునుగోడు, వెలుగు : అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎవరైనా ప్రభుత్వ స్థలాలు, పేదల జోలికి వస్తే సహించేది లేదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హెచ్చరించారు. శనివారం చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన్ ప్రతిష్ట సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గాంధీ సుస్థిర విజ్ఞాన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ సొసైటీ ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు.

 601 గాంధీ  ప్రతిమల ప్రదర్శన తిలకించి విద్యార్థుల మధ్య కూర్చొని చరకా తిప్పారు. అనంతరం చౌటుప్పల్ మున్సిపాలిటీ పాలకవర్గ పదవీ కాలం ముగియడంతో  పాలకవర్గాన్ని ఆయన శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ సొసైటీ నిర్వహిస్తున్న సామాజిక కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు. ఒకేచోట 601 గాంధీ విగ్రహాలను చూడడం ఇదే మొదటి సారి అని తెలిపారు.

 చౌటుప్పల్ మండల కేంద్రంలో కెమికల్ కంపెనీలతో పొల్యూషన్ ఎక్కువగా ఉందని, కెమికల్ కంపెనీలు మండలంలో నుంచి వెళ్తేనే ప్రజలు బాగుపడతారని తెలిపారు. పొల్యూషన్ విషయంలో స్థానిక నాయకులు కంపెనీలతో రాజీ పడొద్దని చెప్పారు. అనంతరం గ్రామంలోని తంగడపల్లి రోడ్డులో నేతాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు మునుగోడు మండల కేంద్రంలోని 10 ,45 ,78, 359 సర్వే నంబర్లలోని ప్రభుత్వ భూములను రెవెన్యూ అధికారులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. కార్యక్రమంలో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ  సంస్థల చైర్మన్ డాక్టర్ రాజేందర్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు కేవీపీ కృష్ణారావు, ప్రభాకర్ రెడ్డి , చౌటుప్పల్ మున్సిపాలిటీ చైర్మన్ వెన్ రెడ్డి రాజు, మండల అధ్యక్ష, కార్యదర్శులు వెన్ రెడ్డి సంధ్య. ఉజ్జిని మంజుల, నాయకులు పాల్గొన్నారు.