చౌటుప్పల్, వెలుగు: మునుగోడు నియోజకవర్గంలోని చెరువులను అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారు. ఆదివారం చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని లక్కారం, తంగడపల్లి, ఊర చెరువులను ఇరిగేషన్ అధికారులు, బెంగళూరుకు చెందిన ఓ ఏజెన్సీతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. గత ప్రభుత్వంలో చెరువులను పట్టించుకోకపోవడంతో ప్రస్తుతం నీళ్లు అడుగంటిపోయని మండిప్డడారు.
కేవలం ఇరిగేషన్ ప్రాజెక్టులు, లిఫ్టులపై ఆధారపడకుండా గొలుసుకట్టు పద్ధతిలో చెరువులను నీటిని నింపాల్సిన అవసరం ఉందన్నారు. ఈ వేసవిలో వీలైనన్నీ ఎక్కువ చెరువులను పునరుద్ధస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తాడూరు వెంకటరెడ్డి, జడ్పీటీసీ చిలుకూరి ప్రభాకర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆకుల ఇంద్రసేనారెడ్డి, మున్సిపాలిటీ అధ్యక్షుడు సుర్వి నరసింహ పాల్గొన్నారు.