ఆర్మీ జవాన్ కుటుంబానికి రూ.20 లక్షల చెక్కు అందజేసిన ఎమ్మెల్యే కోనప్ప

కాగజ్ నగర్ :  విధుల్లో ఉండి ప్రాణాలు కోల్పోయిన కాగజ్‌‌నగర్ పట్టణానికి చెందిన ఆర్మీ జవాన్  షాకీర్ హుస్సేన్ కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచింది. రూ. 25 లక్షల చెక్కును ఇవాళ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప షాకీర్ తండ్రికి అందజేశారు. 2020 అక్టోబర్ 17న లద్దాఖ్​‌‌లో విధులు ముగించుకొని తిరిగొస్తుండగా షాకీర్ హుస్సేన్ ప్రయాణిస్తున్న వాహనంపై  కొండ చరియలు విరిగిపడి అతడు మృతి చెందాడు. అప్పట్లో అతడి కుటుంబానికి అండగా ఉంటామని సర్కార్ ప్రకటించడం తెలిసిందే. చెక్కు అందజేసి వారిలో రిటైర్డ్ ఆర్మీ అసోసియేషన్ నాయకులు, మున్సిపల్ చైర్మన్ మహమ్మద్ సద్దాం హుస్సేన్ ఉన్నారు.