- ఎమ్మెల్యే కోనేరు కోనప్ప
కాగజ్ నగర్, వెలుగు : హైదరాబాద్ నుంచి వచ్చిన నాయకులు ఆడే డ్రామాలను సిర్పూర్ నియోజకవర్గ ప్రజలు నమ్మరని, తనను ఓడించేందుకు వచ్చిన 21 మందిని అడ్రస్ లేకుండా పంపించారని సిర్పూర్ టీ ఎమ్మెల్యే కోనేరు అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా మరోసారి అవకాశం దక్కిన తర్వాత గురువారం ఆయన కాగజ్ నగర్ కు వచ్చారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికి పట్టణంలో భారీ ర్యాలీ చేపట్టారు.
అనంతరం కోనప్ప మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకుల మీద మండిపడ్డారు. నియోజకవర్గంలో ఇప్పుడు కులమతాల పేరుతో కొందరు నాయకులు రాజకీయం చేస్తున్నారని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తాను 1200 ఎకరాలు భూమి అక్రమించినట్లు కొందరు నాయకులు ఆరోపణ చేస్తున్నారని, దమ్ముంటే నిరూపించాలని సవాల్ విసిరారు.