నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : కేఎల్ఐ కాల్వల రిపేర్లను వెంటనే పూర్తి చేయాలని ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్రెడ్డి అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. మంగళవారం నాగర్ కర్నూల్ మండలం తూడుకుర్తి శివారులో మహాత్మ గాంధీ ఎత్తిపోతల పథకం డి7డి, 8డి, డి9 కాల్వలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు పెద్దపీట వేస్తోందన్నారు. సాగునీటి సమస్య రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పారు. అనంతరం గ్రామంలోని పీహెచ్సీని సందర్శించి భవన నిర్మాణాన్నికి స్థలాన్ని పరిశీలించారు.
అన్ని గ్రామాలకు బస్సు సౌకర్యం
నాగర్ కర్నూల్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు ఎమ్మెల్యే రాజేశ్రెడ్డి తెలిపారు. మంగళవారం నాగర్ కర్నూల్ బస్టాండ్ లో తూడుకుర్తి మీదుగా వనపర్తి వెళ్లే ఆర్టీసీ పల్లె వెలుగు బస్సును ఆయన ప్రారంభించారు. తుడుకుర్తి వరకు బస్సును నడిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో కొన్ని గ్రామాలకు బస్సులు నిలుపుదల చేశారని, ఆయా గ్రామాలకు పునరుద్ధరణ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఆర్ఎం లక్ష్మీధర్మ, ఆర్టీసీ డీఎం దేవరాజ్, కాంగ్రెస్ నేతలు కృష్ణారెడ్డి, నరసింహారెడ్డి, కౌన్సిలర్ నిజాముద్దీన్ తదితరులు పాల్గొన్నారు.