భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కొత్తగూడెం నియోజకవర్గాన్ని ప్రభుత్వం, సింగరేణి ఫండ్స్‌తో డెవలప్ చేసేందుకు ప్రణాళికలను రూపొందిస్తున్నామని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. కొత్తగూడెం పట్టణంలోని ఎంజీరోడ్ మార్కెట్ ఏరియాలోని సింగరేణి షాపింగ్ కాంప్లెక్స్ ఏరియాలో సింగరేణి కాలరీస్ కంపెనీ సీఎండీ ఎన్.బలరాంతో కలిసి ఎమ్మెల్యే మంగళవారం పర్యటించారు. అనంతరం ఎమ్మెల్యే విలేకర్లతో మాట్లాడారు.
కొత్తగూడెంలోని ఎంజీ రోడ్‌లోని రూమ్‌ల స్థానంలో సింగరేణి షాపింగ్ కాంప్లెక్స్‌ను నిర్మిస్తే పట్టణంలో వ్యాపారం మరింతగా పెరుగుతుందన్నారు. పట్టణంలో టీ హబ్, మల్టీ ప్లెక్స్‌ల ఏర్పాటు కోసం ప్రభుత్వంతో చర్చించనున్నట్టు తెలిపారు. కొత్తగూడెం, పాల్వంచ పట్టణాల్లో బైపాస్ రోడ్ల నిర్మాణాలకు ప్లాన్ చేస్తున్నామన్నారు. పట్టణంలోని రైల్వే స్టేషన్ నుంచి హేమచంద్రాపురం వరకు, గణేశ్ టెంపుల్ నుంచి వెళ్లే దారితో పాటు పలు ప్రధాన వీధుల్లో రోడ్లను అభివృద్ధి చేయడం, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసేందుకు అవసరమైన నిధుల కోసం సీఎంతో చర్చించనున్నట్టు తెలిపారు. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇప్పించేందుకు కృషి చేస్తానన్నారు.
సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా, నాయకులు సీతారామయ్య, రాజ్‌కుమార్, వంగా వెంకట్, దుర్గారాశి వెంకన్న, కంచర్ల జమలయ్య ఉన్నారు. త్వరలోనే ‘మన ఊరిలో.. మన ఎమ్మెల్యే’పాల్వంచ, వెలుగు : పారిశ్రామిక ప్రాంతమైన పాల్వంచలో అనేక సమస్యలు ఉన్నాయని, వాటి పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సాధించినట్లు కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు అన్నారు. వారంలో ఒకరోజు ‘మన ఊరిలో.. మన ఎమ్మెల్యే’ పేరిట కార్య క్రమం నిర్వహిస్తానని ఆయన హామీ ఇచ్చారు. మంగళవారం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో పరిశుధ్య కార్మికులకు దుస్తులు, ఇతర సామగ్రిని అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అజ్మీర స్వామి, శానిటరీ ఇనిస్పె క్టర్ లక్ష్మణరావు, డీఈ మురళి, సీపీఐ నాయకులు పాల్గొన్నారు.