- వాడీవేడిగా కొత్తగూడెం జడ్పీ జనరల్‌బాడీ మీటింగ్
- ఆఫీసర్ల తీరుపై ప్రజాప్రతినిధుల ఆగ్రహం
- ఆఫీసర్లు మీటింగ్‌లకు ఆబ్సెంట్ కావొద్దు: ఎమ్మెల్యే కూనంనేని
- సమస్యలేం ఉన్నాయో కనీసం ఎమ్మెల్యేలకు చెప్పారా?
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లా పరిషత్ జనరల్ బాడీ మీటింగ్ లకు హెచ్ఓడీలు సక్రమంగా రాకపోవడం పట్ల ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అసహనం వ్యక్తం చేశారు. ఆఫీసర్లు నిబద్ధతతో డ్యూటీ చేస్తేనే కిందిస్థాయి సిబ్బంది సరిగా పనిచేస్తారని చెప్పారు. అత్యవసరమైతే తప్ప మీటింగ్‌లకు ఆఫీసర్లు ఆబ్సెంట్కావొద్దని స్పష్టం చేశారు. కొత్తగూడెంలోని జడ్పీ మీటింగ్‌హాల్‌లో
చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్అధ్యక్షతన శనివారం జడ్పీ జనరల్ బాడీ మీటింగ్ జరిగింది. ఎమ్మెల్యే కూనంనేనితోపాటు ఎమ్మెల్సీ అలుగుబల్లి నర్సిరెడ్డి, జడ్పీ సీఈఓ ప్రసూనారాణి, డిప్యూటీ సీఈఓ చంద్రశేఖర్, డీసీఎంఎస్ చైర్మన్కోత్వాల శ్రీనివాస్, జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఆఫీసర్లు కార్యక్రమానికి హాజరయ్యారు.
సమస్యలు చెప్పకుంటే ఎలా..?
జిల్లా ఏర్పడి ఐదేండ్లు అవుతున్నా పరిషత్‌కు పూర్తి స్థాయి మీటింగ్హాల్లేకపోవడం బాధకరమని, మీటింగ్‌కు వచ్చిన వాళ్లు బయటే కూర్చోవాల్సి వస్తొందని ఈ సందర్భంగా కూనంనేని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్‌శాఖాధికారులు ముందస్తు ప్రణాళికలు చేయకపోవడం వల్లే చిన్న గాలివానకే కరెంట్పోతుందని, రామవరంలోని మాతా, శిశు సంరక్షణ హాస్పిటల్లో తల్లీబిడ్డలు చనిపోతుంటే బాధ్యులపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. మాతా, శివు సంరక్షణ, జిల్లా గవర్నమెంట్జనరల్ హాస్పిటళ్లు
మెడికల్‌కాలేజీకి మధ్య కోఆర్డినేషన్ లేదని, అంతా గందరగోళంగా ఉందని ఫైరయ్యారు. సమస్యలేం ఉన్నాయో కనీసం ఎమ్మెల్యేల దృష్టికి ఆఫీసర్లు తీసుకురాకపోతే ఎలా పరిష్కారం అవుతాయని నిలదీశారు. గవర్నమెంట్స్కూల్స్స్టూడెంట్స్ ఏఏ సబ్జెక్టుల్లో వీక్‌గా ఉన్నారు? టీచర్ల పరిస్థితి ఏంటి? తదితర విషయాలపై జిల్లా విద్యాశాఖాధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని స్పష్టం చేశారు.
ఇష్టమున్నప్పుడల్లా వచ్చిన ఆఫీసర్లు
జిల్లా పరిషత్జనరల్ బాడీ మీటింగ్‌లో ఓవైపు ప్రజాప్రతినిధులు ఫైరవుతున్నా.. ఆఫీసర్లు ఇష్టమున్నట్టుగా వచ్చిపోతుండడం గమనార్హం. మీటింగ్ జరుగుతుండగానే వచ్చిన వాళ్లలో పలువురు ఆఫీసర్లు వెళ్లిపోయారు. రివ్యూ టైంలో పలువురు ఆఫీసర్లు లేకపోవడం పట్ల జడ్పీ చైర్మన్ అసహనం వ్యక్తం చేశారు. మైక్ సక్రమంగా లేకపోవడం పట్ల పలువురు ప్రజాప్రతినిధులు మండిపడ్డారు.
పారిశుద్ధ్య లోపం వెంటాడుతోంది
ఆఫీసర్లు వ్యవహరిస్తున్న తీరుపై ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్తీ విత్తనాలు అరికట్టడంలో ఆఫీసర్లు విఫలమయ్యారని, మిషన్ భగీరథ నీళ్లు సక్రమంగా రావడం లేదన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాలల వివరాలు కనీసం ప్రజాప్రతినిధులకు కూడా ఇవ్వడం లేదని, వంద రోజుల పని ఏదో టైంపాస్‌లా మారిందని పేర్కొన్నారు. అధిక ధరలకు విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు అమ్ముతున్నా ఆఫీసర్లు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
గ్రామాల్లో పారిశుద్ధ్య లోపం వెంటాడుతోందని, డంపింగ్‌యార్డులు నిర్మించినా ఉపయోగించడం లేదన్నారు. గ్రామ పంచాయతీ డెవలప్‌మెంట్‌కోసం దాతలు ఇచ్చిన భూములు ఆక్రమణలకు గురవుతున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. చండ్రుగొండలో దాదాపు రూ.3 కోట్ల విలువైన భూమి ఆక్రమణ అవుతుందని ఆఫీసర్ల దృష్టికి తీసుకువచ్చినా చర్యలు లేవన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఉన్నతాధికారులు వచ్చినప్పుడే గ్రామాల్లో బ్లీచింగ్చల్లుతున్నారని, డబ్బులు మాత్రం బ్లీచింగ్పేరిట భారీగానే ఖర్చు పెడుతున్నారని చెప్పారు.