ట్యాంక్ బండ్ పై సాయుధ పోరాటవీరుల విగ్రహాలు పెట్టండి :ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

ట్యాంక్ బండ్ పై సాయుధ పోరాటవీరుల విగ్రహాలు పెట్టండి :ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
  • సీఎం రేవంత్​రెడ్డికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని లేఖ

హైదరాబాద్​, వెలుగు: తెలంగాణ సాయుధ పోరాట యోధుల విగ్రహాలు ట్యాంక్ బండ్ పై ప్రతిష్ఠించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆదివారం సీఎం రేవంత్ రెడ్డికి ఆయన లేఖ రాశారు. తెలంగాణ సాయుధ పోరాట యోధులైన బద్దం ఎల్లారెడ్డి, రావి నారాయణ రెడ్డి, దొడ్డికొమురయ్య తదితర నాయకుల విగ్రహాలు ట్యాంక్ బండ్ పై పెట్టాలన్నారు. తెలుగు విశ్వ విద్యాలయానికి సురవరం ప్రతాపరెడ్డి, మహిళా విశ్వ విద్యాలయానికి వీరనారి చాకలి ఐలమ్మ, టెక్స్ టైల్ హ్యాండ్ లూమ్ విశ్వవిద్యాలయానికి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టడం అభినందనీయమని చెప్పారు.