భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: కొత్తగూడెం పట్టణ సమగ్రాభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్నానని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. పట్టణంలో రూ. 4.42 కోట్లతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణంలో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నానన్నారు. త్వరలో కొత్తగూడెం నగరంగా మారనుందన్నారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించకపోతే చర్యలు తీసుకుంటామని కాంట్రాక్టర్లను హెచ్చరించారు.
పట్టణంలో పార్కింగ్ స్థలాలను చూపించేందుకు పోలీసులు కృషి చేస్తున్నారన్నారు. ఈ ప్రోగ్రాంలో మున్సిపల్ చైర్ పర్సన్ కె. సీతాలక్ష్మి, కమిషనర్ శేషాంజన్ స్వామి, తహసీల్దార్ పుల్లయ్య, డీఈ రవికుమార్, సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా, కౌన్సిలర్లు, కంచర్ల జమలయ్య, బి. విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.