స్టూడెంట్స్​లోని ప్రతిభను వెలికితీస్తున్నబాలోత్సవ్ : కూనంనేని సాంబశివరావు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : స్టూడెంట్స్​లో సృజనాత్మక శక్తిని బాలోత్సవ్​ వెలికి తీస్తుందని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. అభ్యుదయ కళా సేవా సమితి ఆధ్వర్యంలో కొత్తగూడెంలోని సింగరేణి సీఈఆర్​ క్లబ్​లో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి బాలోత్సవ్​ పోటీలను ఎమ్మెల్యే సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొన్నేండ్లుగా అభ్యుదయ కళా సేవా సమితి ఆధ్వర్యంలో ఆచార్య మద్దెల శివకుమార్​ బాలోత్సవ్​ పేర రాష్ట్ర స్థాయి పోటీలను నిర్వహిస్తుండడం అభినందనీయమన్నారు. 

బాలోత్సవ్​ పేర విజ్ఞాన, సాంస్కృతిక రంగాల్లో పోటీలు పెట్టడం మంచి పరిణామమన్నారు.  ప్రోగ్రాంలో జడ్పీ చైర్మన్​ కంచర్ల చంద్రశేఖర్,  సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్​ పాషా, కళా సేవా సమితికి చెందిన అందెల ఆనందరావు, అల్లి శంకర్, రాందాస్, ధన్​రాజ్, మునీల, నీరజరెడ్డి పాల్గొన్నారు.