- కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : అధునాతన హంగులతో కొత్తగూడెంలో బస్టాండ్ నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. కొత్తగూడెం ఆర్టీసీ డిపోలో కొత్తగా వచ్చిన ఇంద్ర ఏసీ బస్సును ఎమ్మెల్యే శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాన ప్రాంతాలకు బస్సులు నడిపేలా ఆర్టీసీ అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ఏజెన్సీ గ్రామాలకు ప్రయాణ సేవలను ఆర్టీసీ అందించలేకపోతుందని చెప్పారు. ఆర్టీసీని ప్రజలు ఆదరించాలన్నారు. ఈ ప్రోగ్రాంలో డిపో మేనేజర్ దేవెందర్‌గౌడ్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సునీత, కంట్రోలర్లు వై.నాగేశ్వరరావు, జాకబ్‌తో పాటు సీపీఐ, ఆర్టీసీ యూనియన్ల నేతలు సాబీర్ పాషా, కందుల భాస్కర్, దుర్గారాశి వెంకన్న, కంచర్ల జమలయ్య, వి. మురళి పాల్గొన్నారు.
గోనె సంచులు అందుబాటులో ఉంచాలి
పాల్వంచ : కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అవసరమైన గోనె సంచులను అందుబాటులో ఉంచాల ని ఎమ్మెల్యే కూనంనేని కేంద్రాల నిర్వాహకులకు సూచించారు. శుక్రవారం మండలంలోని సోములుగూడెంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించా రు.ఈ కార్యక్రమంలో మార్క్ ఫెడ్ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కె సాబీర్ పాషా, ఎంపీడీవో విజయభాస్కర్ రెడ్డి, కో-ఆపరేటివ్ సొసైటీ వైస్ చైర్మన్ కాంపెల్లి కనకేష్, సొసైటీ డైరెక్టర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.