పాల్వంచ, వెలుగు : పాల్వంచను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. గురువారం గిరిజన గ్రామాలైన చిన్న బంగారు జాల, గుడిపాడు, శ్రీనివాస కాలనీ, ఇందిరా కాలనీ, వనమాకాలనీ, కాంట్రా క్టర్స్ కాలనీల్లో రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి ఆయన శంకుస్థాపనలు చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణంలో వంద పడకల ఆసుపత్రి, బైపాస్ రోడ్డు నిర్మాణం, మోడల్ పాఠశాలలతో పాటు పలు భారీ ప్రాజెక్టులకు రూపకల్పన చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ డాకూ నాయక్, డీఈ స్వరూపారాణి, అధికారులు, కాంగ్రెస్, పీపీఐ నాయకులు పాల్గొన్నారు.