పాల్వంచ, వెలుగు: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీ ప్రక్రియ బహుళ ప్రయోజనాలు కలిగిస్తుందని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. శుక్రవారం పట్టణంలోని బొల్లోరి గూడెంలో డిజిటల్ కార్డుల పైలెట్ ప్రాజెక్టు ఎంపిక ప్రక్రియను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. సంక్షేమ పథకాల అమలు సులభతరం చేసేందుకు ఈ కార్డు దోహదపడుతుందన్నారు. కొత్తగూడెం ఆర్డీవో డి. మధు, తహసీల్దార్లు వివేక్, పుల్లయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి ముత్యాల విశ్వనాథం, అడుసుమల్లి సాయిబాబా, వీసం శెట్టిపూర్ణ, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
అందరికీ ఫ్యామిలీ డిజిటల్ కార్డ్స్: ఎమ్మెల్యే ఆదినారాయణ
ములకలపల్లి,వెలుగు: సంక్షేమ పథకాలన్నింటినీ ఒకే కార్డు కిందకు తీసుకువస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఫ్యామిలీ డిజిటల్ కార్డులను అందజేయనుందని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ జితేశ్. వి. పాటిల్‌తో కలిసి ముత్యాలంపాడు గ్రామ పంచాయతీలో ఫ్యామిలీ డిజిటల్ కార్డ్స్ కుటుంబ సర్వే ను వారు పరిశీలించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అన్ని రకాల సంక్షేమ పథకాలకు ఈ కార్డు ఉపయోగపడుతుందన్నారు.