భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లా కేంద్రమైన కొత్తగూడెం పట్టణానికి ఔటర్ రింగ్‌రోడ్ మంజూరైందని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. పట్టణంలోని శేషగిరి భవన్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రూ.450కోట్లతో 25కిలోమీటర్ల మేర ఔటర్రింగ్రోడ్నిర్మాణం జరుగనున్నదని తెలిపారు. ఇల్లెందు–కొత్తగూడెం హైవే రహదారిలోని అనిశెట్టిపల్లి నుంచి హేమచంద్రాపురం
సర్వారం, చిట్టిరామవరం, జగన్నాథపురం వరకు పాల్వంచ–భద్రాచలం హైవే వరకు ఔటర్ రింగ్ రోడ్ ప్లాన్ ఉంటుందన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి రూ. 72.86కోట్ల పనులు శాంక్షన్అయినట్లు తెలిపారు. లెక్టరేట్ ఎదుట హైవేపై, కొత్తగూడెం పట్టణంలోనూ మూడు ఫుట్ఓవర్ బ్రిడ్జీల పనులు త్వరలో ప్రారంభించనున్నామని తెలిపారు. కొత్తగూడెం–పాల్వంచ మున్సిపాలిటీలను కలిపి కార్పొరేషన్ ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.